ఆ విషయం తెలుసుకోవాలంటే కమలహాసన్ మరో జన్మ ఎత్తాలి: గిరిరాజ్ సింగ్

  • ముస్లింలు తెలివైనవారు అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి
  • ఇలాంటి వ్యాఖ్యలు ఆయనకు ప్రయోజనం చేకూర్చవు
  • అరెస్ట్ చేస్తారనే భయం కమల్ కు అవసరం లేదు
మన పురాణాల్లో హిందూ అనే ప్రస్తావనే లేదని... ఆళ్వారులు, నాయనారులు కూడా తమ కీర్తనల్లో హిందూ అనే పదాన్ని వాడలేదని కమలహాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ అనేది విదేశీ పదమని... మొఘల్ చక్రవర్తులు లేదా అంతకు ముందు వచ్చిన విదేశీ పాలకులు కానీ ఆ పదాన్ని తీసుకొచ్చారని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ముస్లింలను తెలివైనవారిగా గుర్తించాలనే విధంగా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.  హిందూ అంటే ఏమిటో తెలుసుకోవడానికి కమల్ కనీసం వందేళ్లు అధ్యయనం చేయాల్సి ఉంటుందని అన్నారు. హిందూమతం గురించి తెలుసుకోవాలంటే ఆయన మరో జన్మ ఎత్తాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాజకీయాల్లో ఎదగాలని ఆయన అనుకుంటున్నారని... అయితే, ఇది ఆయనకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదని అన్నారు. అరెస్ట్ చేస్తారేమో అనే భయం కమల్ కు అవసరం లేదని... ఎందుకంటే 'ఆయన ఒక ముస్లిం' అని సెటైర్ వేశారు. 
Go Back to Shorts
Kamal Haasan
hindu
giriraj singh
bjp
mnm

More Telugu News